డివిడి డిస్క్ లలో ఉండే ఫైళ్ల వివరాలు
ఎప్పుడైనా డివిడి డిస్క్ ల్లోని ఫైళ్ల పేర్లను చూసినట్లయితే VOB, IFO, BUP వంటి ఎక్స్ టెన్షన్ నేం కలిగిన ఫైళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఒక డివిడి డిస్క్ ని డివిడి ప్లేయర్లో ప్లే చేయాలంటే ఈ ఫైళ్లు తప్పనిసరిగా ఉండాలి. VOB ఫైళ్లలో సినిమా యొక్క ఆడియో మరియు వీడియో సమాచారం భద్రపరచబడి ఉంటుంది. IFO ఫైళ్లలో ఆ డివిడి మూవీని డివిడి ప్లేయర్ ఎలా ప్లే చేయాలన్న వివరణ ఉంటుంది. IFO ఫైల్ లేనిదే వీడియో, ఆడియో సమాచారంతో కూడిన VOB ఫైల్ ఉన్నాడివిడి ప్లేయర్ (టివికి కనెక్ట్ చేసుకునేది) ఆ వీడియోని ప్లే చేయలేదు. IFO ఫైళ్లు ఏ కారణం చేతైనా కరప్ట్ అయినట్లయితే, వాటి స్థానే బాధ్యతలు నిర్వర్తించడానికి IFO ఫైళ్లకు బ్యాకప్ కాపీగా BUP ఫైళ్లు డివిడి డిస్క్ల్ లో భద్రపరచబడి ఉంటాయి. చాలామంది కేవలం ఒరిజినల్ డివిడి డిస్క్ లోని VOB ఫైళ్లను వేరే ఖాళీ డివిడిలోకి కాపీ చేస్తే డివిడి రెడీ అయిపోతుందని భావిస్తుంటారు. IFO, BUP ఫైళ్లు లేకుండా ఒరిజినల్ VOB ఫైల్ ఉన్నా టివికి కనెక్ట్ చేసే డివిడి ప్లేయర్ విషయంలో అది నిరుపయోగమే!
No comments:
Post a Comment